విషాదం.. నీటి కుంటలో పడి అన్నదమ్ములు మృతి

by Vemula.Srinu Prasad |

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం రూరల్ మండలం బ్రహ్మసముద్రంలో విషాదం చోటు చేసుకుంది...

విషాదం.. నీటి కుంటలో పడి అన్నదమ్ములు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా కల్యాణదుర్గం రూరల్ మండలం బ్రహ్మసముద్రంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి అన్నదమ్ములు మృతి చెందారు. వాల్మికి సర్కిల్‌లో నివాసముండే నరేంద్ర, చరణ్ వెంకటాపురం గ్రామ శివారు ప్రాంతంలో మామిడి చెట్లకు కూలీలతో పురుగు మందు పిచికారి చేయిస్తు్న్నారు. ఈ క్రమంలో నరేంద్ర, చరణ్ నీటి కుంట వద్దకు వెళ్లారు. అయితే కాలుజారి తమ్ముడు చరణ్ నీటిలో కుంటలో పడ్డారు. దీన్ని గమనించి తమ్ముడిని కాపాడేందుకు అన్న నరేంద్ర ప్రయత్నం చేశారు. అయితే ఇద్దరికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. ఊపిరాడక ఇద్దరు మృతి చెందారు. ఎంతకి తిరిగి వెళ్లకపోవడంతో కూలీలు నీటి కుంట వద్దకు వెళ్లి చూశారు. ఇద్దరి మృతదేహాలు కనిపిచాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story