- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చీ.. ఇదేం బుద్ధి: ఇకనైనా మారండి..!
రోడ్డు ప్రమాదం జరిగి డ్రైవర్, క్లీనర్ హలో లక్ష్మణా అంటుంటే కొందరు జనం ఏ మాత్రం కనికరం లేకుండా అక్కడ పడిన మామిడి పండ్లు ఎత్తుకెళ్లారు. ..

దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగి డ్రైవర్, క్లీనర్ హలో లక్ష్మణా అంటుంటే కొందరు జనం ఏ మాత్రం కనికరం లేకుండా అక్కడ పడిన మామిడి పండ్లు ఎత్తుకెళ్లారు. సహాయ చర్యలు అందించాల్సిందిపోయి చిక్కిందే చందంగా అనేలా ప్రవర్తించిన తీరు విమర్శలకు తావిచ్చింది. ఈ ఘటన అనంతపురం జిల్లా(Ananthapuram) రాప్తాడు(Raptadu)లో జరిగింది. మామిడిపండ్లతో వెళ్తున్న లారీ(Lorry) జాతీయ రహదారి(National Highway) 44పై అదుపు తప్పి బోల్తా(Roll Over) పడింది. దీంతో లారీలోని పండ్లన్నీ రోడ్డుపై పడ్డాయి. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. అయితే కొంతమంది స్థానికులు సహాయ చర్యలు అందించకపోగా రోడ్డుపై పడిన మామిడిపండ్లను తీసుకెళ్లారు. దీంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ మేరకు కక్కుర్తి బుద్ధి చూపించిన జనాలపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇకనైనా మారండంటూ కామెంట్స్ పెడుతున్నారు.






