Anantapur Big Theft : భారీ దొంగతనం కేసును ఛేదించిన అనంతపురం పోలీసులు

by Y. Venkata Narasimha Reddy |
Anantapur Big Theft : భారీ దొంగతనం కేసును ఛేదించిన అనంతపురం పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం(Anantapur)లో గత నెల 22న రాజహంస విల్లాలో తాళం వేసిన మూడు ఇండ్లలో జరిగిన భారీ దొంగతనం(Big Theft Case)కేసును పోలీసు(Police)లు చేధించారు(Solved). రైతు వెంకటశివారెడ్డి, జెన్ కో డీఈ శివశంకర్ నాయుడు, మరో ఓనర్ రంజిత్ ఇంటిలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ముఖ్యంగా వెంకట శివారెడ్డి తన కూతురు పెళ్లి కోసం సిద్ధం చేసుకున్న నగలు, నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అనంతపురం పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఓ దొంగ మాస్కు ధరించి ఇంట్లోకి ప్రవేశించినట్లుగా గుర్తించారు. క్లూస్ టీమ్ ను రంగంలోకి దించారు.

ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దొంగల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దొంగలు సుమారు రూ.3.5 కోట్ల బంగారం, వజ్రాలతో పాటు రూ.20 లక్షల నగదు చోరీ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసు బృందాలు దొంగల ముఠాను పట్టుకున్నారు. ముఠాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నారు పచవార్, సావన్, సునీల్ లను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. నేరస్థులు మధ్యప్రదేశ్ కు చెందిన వారని పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి చోరీ సొత్తుతో పాటు రెండు సెల్ ఫోన్లు, మూడు బైక్ లు, చోరీ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు.

Advertisement
Next Story