ఆధ్యాత్మిక రాజధానిగా ఏపీ.. అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2026-01-22 06:05:43  IST  )

తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గురువారం ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

ఆధ్యాత్మిక రాజధానిగా ఏపీ.. అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గురువారం ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు తన విదేశీ పర్యటనను ముగించుకుని శుక్రవారం రాష్ట్ర రాజధానికి తిరిగి రానున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ లక్ష్యాలతో విదేశాల్లో ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి విస్తృతంగా సమావేశమయ్యారని వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని ఆలయాలు శోభాయమానంగా ఉన్నాయని మంత్రి ఆనం పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించామని, హిందూ ధర్మ ఆచారాలకు అనుగుణంగా సంక్రాంతి వేడుకలు విజయవంతంగా జరుపుకున్నామని తెలిపారు.

రథసప్తమి ఉత్సవాలు..

ఆంధ్రప్రదేశ్‌ను ఆధ్యాత్మిక రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో జరిగే రథసప్తమి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి అచ్చెన్నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు సంయుక్తంగా పర్యవేక్షిస్తారని వివరించారు. తిరుమలలో నిర్వహించే రథసప్తమి ఉత్సవాలకు టీటీడీ బోర్డు, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని, ఈ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి ఆనం స్పష్టం చేశారు.

Read More..

దావోస్‌లో ఆసక్తికర భేటీ: మీటింగ్ రూమ్ కాదు.. ‘లేట్ నైట్ వాక్‌’లో టాటా బాస్‌తో లోకేశ్ చర్చలు!

Next Story