అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌కు మాతృ వియోగం

by Thanuru Gopichand |

అనకాపల్లి ఎంపీ డాక్టర్ సీఎం రమేశ్ (CM Ramesh) మాతృమూర్తి చింతకుంట రత్నమ్మ (83) తుదిశ్వాసను (Mother Demise) విడిచారు.

అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌కు మాతృ వియోగం
X

దిశ, వెబ్ డెస్క్ : అనకాపల్లి ఎంపీ డాక్టర్ సీఎం రమేశ్ (CM Ramesh) మాతృమూర్తి చింతకుంట రత్నమ్మ (83) తుదిశ్వాసను (Mother Demise) విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం తెల్లవారుజామున 3.39 నిమిషాలకు పొట్లదుర్తిలోని సొంత నివాసంలో ప్రాణాలను విడిచారు. తమ కుటుంబానికి వెన్నెముకగా, జీవితానికి వెలుగుగా నిలిచి తమ తల్లి ఇక లేరనే నిజాన్ని అంగీకరించడం బాధగా ఉందని ఎంపీ అన్నారు. తన బాధను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. తమ తల్లి ప్రేమ, త్యాగం, ఆప్యాయత మాటల్లో చెప్పలేనంత గొప్పవన్నారు. తమ కష్టాల్లో తమకంటే ఎక్కువగా కలవరపడేవారని.. తామెల్లప్పుడూ జీవితంలో ముందుకెళ్లాలని, మంచి చేయాలని కోరుకునేవారని గుర్తు చేసుకున్నారు. తన విజయాల వెనక, తన ప్రతి అడుగులో తల్లి ఆశీస్సులు, నమ్మకం, ప్రేమ బలంగా నిలిచాయన్నారు. వారు చూపిన బాటలో జీవితాంతం నడుస్తామన్నారు. వారిని కోల్పోయినందుకు ఎంతో ఆవేదనగా ఉందన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు కడప జిల్లాలోని ఎర్రగుంట్ల మండలంలో ఉన్న పొట్లదుర్తి గ్రామంలో అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

Next Story