- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లారీకి ఊహించని ప్రమాదం.. డ్రైవర్ స్పాట్ డెడ్
రోడ్డు పక్కన ఆపిన లారీ(Lorry)కి ఊహించని ప్రమాదం జరిగింది....

దిశ, వెబ్ డెస్క్: రోడ్డు పక్కన ఆపిన లారీ(Lorry)కి ఊహించని ప్రమాదం జరిగింది. దీంతో డ్రైవర్(Driver) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా(Ambedkar Konaseema District) కొత్తపేట మండలం పలివెల(Palivela) వద్ద జరిగింది. తమిళనాడు(Tamilanadu)కు చెందిన కమల్ కుమార్...లోడ్‌తో కంటైనర్ లారీని రావుల పాలెం నుంచి అమలాపురం నడుపుకుంటూ వెళ్లారు. అయితే పలివెలకు వెళ్లగానే లారీని రోడ్డు పక్కన పార్క్ చేసేందుకు ప్రయత్నం చేశారు.
అయితే లారీకి ఒక్కసారిగా కరెంట్ తీగలు తగిలాయి. వెంటనే లారీ టైర్ల నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో డ్రైవర్ కిందకు దూకేందుకు ప్రయత్నం చేశారు. కానీ విద్యుత్ షాక్ తగిలి డ్రైవర్ కమల్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి లారీలో చెలరేగిన మంటలను అదుపు చేశారు. డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






