- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ-డీ3 రాకెట్
నెల్లూరు శ్రీహరి కోట నుంచి ఎస్ఎస్ఎల్వీ-డీ3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది..

X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు శ్రీహరి కోట నుంచి ఎస్ఎస్ఎల్వీ-డీ3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. షార్‌లోని తొలి లాంచ్ ప్యాడ్ నుంచి శాస్త్రవేత్తలు ఈ రాకెను నింగిలోకి ప్రయోగించారు. నిప్పులు కక్కుతూ కక్ష్యలను దాటుకుంటూ నింగిలోకి దూసుకుపోతోంది. ఈఓఎస్-08 శాటిలైట్‌ను ఈ రాకెట్ మోసుకెళ్తోంది. ఇది ఎస్ఎస్ఎల్వీ సిరీస్‌లో మూడో డెవలప్‌మెంట్ ప్రయోగం. మైక్రో శాటిలైట్ల అభివృద్ధి, భవిష్యత్ ఉపగ్రహాల తయారీ లక్ష్యంగా ఈ రాకెట్‌ను రూపొందించారు. సరిగ్గా ఈ రోజు ఉదయం 9 గంటల 17 నిమిషాలకు ఈ రాకెట్‌కు శాస్త్రవేత్తలు నింగిలోకి లాంఛ్ చేశారు. ఈఓఎస్-08 శాటిలైట్ పర్యావరణం, విపత్తులు, అగ్నిపర్వతాలపై పర్యవేక్షణకు ఉపయోగపడనుందని శాస్తవేత్తలు తెలిపారు.
Next Story






