బస్సులో మహిళా ఉద్యోగిని రచ్చ రచ్చ.. డ్రైవర్, కండక్టర్‌పై గుంపులు, గుంపులుగా దాడి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-23 12:50:23  IST  )

కర్నూలు జిల్లా డోన్‌లో ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ పై ప్రభుత్వ ఉద్యోగిని బంధువులు దాడి చేశారు..

బస్సులో మహిళా ఉద్యోగిని రచ్చ రచ్చ.. డ్రైవర్, కండక్టర్‌పై గుంపులు, గుంపులుగా  దాడి
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా డోన్‌(Kurnool District Dhone)లో ఆర్టీసీ బస్సు(RTC bus)లో మహిళా ఉద్యోగిని రచ్చ రచ్చ చేసింది. టికెట్లు ఇస్తున్న సమయంలో కండక్టర్‌ తగిలాడని వాగ్వాదానికి దిగింది. అనుకోకుండా జరిగిందని చెప్పినా వినకుండా బూతులతో విరుచుకుపడింది. తాను ప్రభుత్వ ఉద్యోగినని, ఆర్టీసీ అధికారులకు కంప్లైట్ చేస్తానంటూ వీడియో తీసి బెదిరించింది. దీంతో బస్సును డ్రైవర్ స్థానిక పోలీస్ స్టేషన్‌ వద్దకు తీసుకెళ్లారు. అయితే పోలీసులు సర్ది చెప్పారు. దీంతో బస్సు అనంతపురానికి బయల్దేరింది. ఈలోపు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి జరిగిన సంఘటనను తెలిపింది. ఒక్కసారిగా కోపోద్రికులైన ఉద్యోగిని కుమారుడు, భర్త అనుచరులతో వెళ్ళి ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై దాడి చేశారు. బస్సుపై రాళ్ల దాడి చేశారు. దీంతో కర్నూలు పోలీసులకు ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ ఫిర్యాదు చేశారు.

Next Story