- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీడీపీ కార్యకర్త అంటే ఇలా ఉండాలి.. మహానాడులో ఈ పెద్దాయనను ప్రశంసిన చంద్రబాబు
టీడీపీ మహానాడులో ఓ పెద్దాయన స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు...

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ మహానాడు(Tdp Mahanadu)లో ఓ పెద్దాయన స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. స్ఫూర్తిదాతగా నిలిచారు. తెలుగుదేశం పార్టీ(Telugu Party) కార్యకర్త అంటే ఇలా ఉండాలని నిరూపించారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు కార్యక్రమానికి ఆయన సైకిల్‌పై వెళ్లారు.. ఇందులో విశేషం ఏముందనుకుంటారా..?. అక్కడే పట్టుదల, తెలుగుదేశం పార్టీపై ఆయనకున్న అభిమానం కనిపిస్తుంది.
ఈ పెద్దాయనకు తెలుగుదేశం పార్టీ అంటే పిచ్చి. ఎక్కడ సభలు, సమావేశాలు జరిగినా సైకిల్(Cycle)పై వెళ్లిపోతారు. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా కడపలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి ఈ పెద్దాయన 400 కిలోమీటర్ల మేర సైకిల్‌పై ప్రయాణం చేసి వెళ్లారు. ఈ విషయం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. మహానాడు బహిరంగ సభలో పెద్దాయనపై సీఎం చంద్రబాబు(Cm Chandrababu) ప్రశంసలు కురిపించారు. స్టేజ్‌పైకి పిలిచి అందరికీ చూపిస్తూ స్ఫూర్తి దాత అంటూ కితాబిచ్చారు. తెలుగుదేశం పార్టీకి ఇలాంటి కార్యకర్తలు ఉండటం పూర్వ జన్మ సుకృతం అని కొనియాడారు. అటు మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) సైతం లేచి చప్పట్లు కొడుతూ పెద్దాయనను అభినందించారు. అనంతరం పెద్దాయన వివరాలు తెలుసుకున్నారు.






