- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap Assembly: సీఎం చంద్రబాబు చాంబర్‌కు పవన్ కల్యాణ్.. గంటకుపైగా భేటీ
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ సమావేశాలు(Assembly Meetings) జరుగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీలోని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) చాంబర్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) వెళ్లారు. రాష్ట్ర బడ్జెట్‌తో పాటు వివిధ శాఖలకు కేటాయింపులు, ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆయన చర్చించారు. అలాగే ప్రభుత్వ పథకాలపైనా ముఖ్యమంత్రితో పవన్ కల్యాణ్ చర్చించినట్లు తెలుస్తోంది. అభివృద్ధి, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే తల్లికి వందనం అన్నదాత పథకాలపై గంటపాటు చర్చించారు. పలు రాజకీయ అంశాలపైనా చర్చించినట్లు సమాచారం.
ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఇద్దరి భేటీకి ప్రాధాన్యత చోటు చేసుకుంది ఐదు ఎమ్మెల్సీ స్థానాలల్లో జనసేన రెండు, బీజేపీ ఒక ఎమ్మెల్సీని కోరుతున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఇప్పటికే ఎమ్మెల్సీ ఖరారు అయింది. అయితే ఇంకో ఎమ్మెల్సీకి అవకాశం ఇవ్వాలని పవన్ కల్యాణ్ కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో కూటమి అభ్యర్థి వెనుకంజలో ఉండటం, పీడీఎఫ్ అభ్యర్థి ముందంజలో ఉండటంపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం చంద్రబాబు, పవన్ భేటీ కొనసాగుతోంది. ముగిసిన తర్వాత ఈ భేటీ ఎందుకనే విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.






