- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెరువులో స్నానానికి వెళ్లి ఇంటర్ విద్యార్థి గల్లంతు
by Seetharam |
స్నేహితులతో కలిసి చెరువులో స్నానానికి వెళ్లిన ఓ విద్యార్థి గల్లంతు అయ్యాడు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : స్నేహితులతో కలిసి చెరువులో స్నానానికి వెళ్లిన ఓ విద్యార్థి గల్లంతు అయ్యాడు. ఈ ఘటన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం కొవ్వాడ అన్నవరంలో జరిగింది. కొవ్వాడ అన్నవరంకు చెందిన ఇందుకూరి శేషనాగ వర్మ(17) ఇంటర్ చదువుతున్నాడు.ఆదివారం సెలవు కావడంతో స్నేహితులతో కలిసి పంచాయతీ చెరువులో దిగాడు. కాసేపటికి చెరువులో శేష నాగ వర్మ గల్లంతు అయ్యాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. చేపల వలలు వేసి చెరువంతా జల్లెడ పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story






