Nandyala: పంటి నొప్పితే ఆస్పత్రికి వెళ్తే ప్రాణం పోయింది

by Vemula.Srinu Prasad |

పంటి నొప్పితే ఆస్పత్రికి వెళ్తే ప్రాణం పోయిన ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది..

Nandyala: పంటి నొప్పితే ఆస్పత్రికి వెళ్తే ప్రాణం పోయింది
X

దిశ, వెబ్ డెస్క్: పంటి నొప్పితే ఆస్పత్రికి వెళ్తే ప్రాణం పోయింది. ఈ ఘటన నంద్యాల జిల్లా((Nandyal District))లో జరిగింది. సంజామాల మండలం చిన్న కొత్తపేట(Chinnakothapet) గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మి రెండు రోజులుగా పంటి నొప్పితో బాధపడుతున్నారు. దీంతో సంజామలలోని ఆస్పత్రికి వెళ్లారు. అయితే ఆమె పంటి నొప్పికి ఆర్ఎంపీ వైద్యుడు చికిత్స చేశారు. నరానికి ఇంజెక్షన్ ఇవ్వడంతో మహిళ స్పృహ కోల్పోయారు. దీంతో ఆమెను కోవెలకుంట్ల ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మహిళ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్ఎంపీ వైద్యుడు అక్కడి నుంచి పారిపోయారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story