ప్రభుత్వ కార్యాలయంలో కామకలాపాలు.. ఏపీటీడీసీ ఉద్యోగి సస్పెన్షన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-05 05:29:43  IST  )

ప్రభుత్వ కార్యాలయంలో కామకలాపాలు సాగించిన ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు పడింది..

ప్రభుత్వ కార్యాలయంలో కామకలాపాలు.. ఏపీటీడీసీ ఉద్యోగి సస్పెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఏపీటీడీసీ డివిజనల్ కార్యాలయం(Vijayawada APTDC Divisional Office) ఉద్యోగి వ్యవహారం ఆదివారం కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఆయనపై వేటు పడింది. ప్రభుత్వ ఆస్తిని సొంత పనులకు ఉపయోగించినందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. నిన్ననే ఆయనను సస్పెండ్ చేశారు. ఈ రోజు ఆర్డర్ కాపీ అందించనున్నారు. అప్పటి వరకూ విజయవాడ హెడ్ క్వార్టర్ పరిధి దాటి ఎక్కడికీ వెళ్లకూడదని వెంకటేశ్వర్లును ఉన్నతాధికారులు ఆదేశించారు.

కాగా ఏపీటీడీసీ డివిజన్ కార్యాలయం అకౌంటెంట్ గంగి వెంకటేశ్వర్లు(Accountant Gangi Venkateswarlu) ప్రతి రోజూ విధులు ముగిసిన తర్వాత బైక్‌పై ఓ మహిళను తీసుకెళ్లి తన కార్యాలయంలో కామకలాపాలు సాగిస్తున్నారు. వెంకటేశ్వర్లు తన కార్యాలయంలోకి మహిళను తీసుకెళ్తున్న దృశ్యాలు స్థానిక సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే విచారణ చేపట్టారు. చాలా కాలంగా వెంకటేశ్వర్లు రాసలీలలు సాగిస్తున్నట్లు తేలింది. అంతేకాదు విజయవాడ హరిత బెర్మ్ పార్క్‌లోని స్టాఫ్ రూమ్‌లోనూ వెంకటేశ్వర్లు కొంతకాలం రాసలీలు సాగించినట్లు బయట పడింది.

Next Story