విజయవాడలో మరీ ఇంత దారుణమా.. వృద్ధురాలు అని కూడా చూడకుండా..?

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-22 11:41:54  IST  )

విజయవాడలో సుంకర శివాజీ అనే వ్యక్తి తమ భూమి కబ్జా చేశారంటూ వృద్ధ దంపతులు రోడ్డెక్కారు..

విజయవాడలో మరీ ఇంత దారుణమా.. వృద్ధురాలు అని కూడా చూడకుండా..?
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)భవానీపురంలో సుంకర శివాజీ అనే వ్యక్తి తమ భూమి కబ్జా చేశారంటూ తమ కొడుకుతో కలిసి వృద్ధురాలు రోడ్డెక్కారు. 15 ఏళ్ల క్రితం తమ స్థలాన్ని సుంకర శివాజీ(Sunkara Sivaji) అద్దెకు తీసుకున్నారని, దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఇప్పుడు ఆ స్థలం తమదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఆ స్థలం నుంచి తమను మెడపట్టుకుని బయటకు గెంటేశారని ఆరోపించారు. పోలీసులు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story