- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టైరు పగిలి రోడ్డు ప్రమాదం.. ఎగిరి ఏడడుగుల గుంతలో పడిన ఆటో
కడప జిల్లాలో ఘోర ప్రమాద తప్పింది. రోడ్డుపై వేగంగా వెళ్తున్న సమయంలో ఆటో టైరు పగిలింది. దీంతో అదుపు తప్పి 7 అడుగుల గుంతలో పడింది. ఈఘటనలో 8 మందికి గాయాలు అయ్యాయి...

X
దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా(Kadapa District)లో ఘోర ప్రమాద తప్పింది. రోడ్డుపై వేగంగా వెళ్తున్న సమయంలో ఆటో(Auto) టైరు పగిలింది. దీంతో అదుపు తప్పి 7 అడుగుల గుంతలో పడింది. ఈఘటనలో 8 మందికి గాయాలు అయ్యాయి. అట్లూరు మండలం లింగాలకుంట(Lingalakunta)కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో క్షతగాత్రులందరిని బద్వేల్ ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గుంతలో పడిన ఆటోను క్రేన్ సాయంతో బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా క్షతగాత్రులంతా లింగాలకుంటకు చెందిన వారే. ఈ లేచిన సమయం బాగుందని, అందువల్లే పెను ప్రమాదం నుంచి బయటపడ్డామని క్షతగాత్రులు తెలిపారు. పోలీసులు, స్థానికులు సకాలంలో తమను ఆస్పత్రికి తరలించారని తెలిపారు.
Next Story






