- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆన్ లైన్ గేమ్స్ వద్దని వారించిన తల్లి.. కడతేర్చిన కొడుకు
విశాఖ జిల్లా మల్కాపురంలో దారుణం జరిగింది...

దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా మల్కాపురం(Visakha District Malkapuram)లో దారుణం జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందారు. సముద్ర తీర ప్రాంత రక్షక దళం కోస్ట్ క్వాటర్స్(Defense Force Coast Quarters)లో ఆమె మృతదేహాన్ని కొందరు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఒంటిపై గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్నారు. మృతురాలు కోస్ట్ గార్డ్ కమాండర్ ఉద్యోగి భార్య ఆల్కా సింగ్(Coast Guard Commander Employee Wife Alka Singh )గా గుర్తించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల విచారణలో కీలక విషయాలు
అయితే ఆల్కా సింగ్‌ను తన కుమారుడు అన్‌మోల్ సింగ్ చంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆన్ లైన్ గ్రేమ్స్(Online Grimes)కు బానిసైన కుమారుడిని ఆల్కా సింగ్ మందలించారు. ఆన్ లైన్ గేమ్స్ ఆడవద్దంటూ వారించారు. దీంతో అన్‌మోల్ సింగ్ ఆగ్రహానికి గురయ్యారు. కన్న తల్లిని బలంగా కొట్టారు. కుమారుడి దాడిలో ఆల్కా సింగ్ మృతి చెందారు. ఈ ఘటనతో కుమారుడు అక్కడి నుంచి పారిపోయారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
కన్నతల్లిని కొట్టి చంపడంపై ఆగ్రహావేశాలు
ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. కన్నతల్లిని కొట్టి చంపిన అన్‌మోల్ సింగ్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీ పెంచిన తల్లి పట్ల కనికరం లేకుండా కుమారుడు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి కుమారుడు ఎవరికీ వద్దని ధ్వజమెత్తారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని మానసిన వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని సూచిస్తున్నారు. పిల్లల మానసిక స్థితిపై సెల్ ఫోన్లు తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయని, 18 ఏళ్లు వచ్చే వరకూ వాళ్లకు ఇవ్వద్దొని హెచ్చరిస్తున్నారు.






