Breaking: బీసీ హాస్టల్ సమీపంలో దారుణం.. ఓ సందులో అర్ధరాత్రి స్పృహలేకుండా పడి ఉన్న విద్యార్థిని

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-31 05:19:08  IST  )

శ్రీకాకుళంలో గత అర్ధరాత్రి దారుణం జరిగింది..

Breaking: బీసీ హాస్టల్ సమీపంలో దారుణం.. ఓ సందులో అర్ధరాత్రి స్పృహలేకుండా పడి ఉన్న విద్యార్థిని
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం(Srikakulam)లో గత అర్ధరాత్రి దారుణం జరిగింది. బీసీ హాస్టల్(BC Hostel) సమీపంలోని ఓ సందులో విద్యార్థిని(Student) స్పృహలేకుండా పడి ఉన్నారు. విజయనగరానికి చెందిన విద్యార్థిని డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఏమైందో ఏమోగాని హాస్టల్ దగ్గర సందులో అనుమానాస్పదంగా పడి పోయి కనిపించారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

అయితే విద్యార్థినికి ఫిట్స్ ఉన్నట్లు హాస్టల్ సిబ్బంది చెబుతున్నారు. కానీ తన కుమార్తెకు ఫిట్స్ లేవని తండ్రి రమేశ్ చెప్పారు. పాప పడి ఉన్న చోట మందు బాటిళ్లు ఉన్నాయని తెలిపారు అయితే విద్యార్థిని ఒంటిపై గాయాలుండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ కూతురికి ఏం జరిగిందోనని తండ్రి రమేశ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా పూర్తి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

‘‘అసలు విద్యార్థిని ఆ సందులోకి ఎందుకు వెళ్లింది. ఆ సమయంలో హాస్టల్ సిబ్బంది ఏం చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో హాస్టల్ విద్యార్థులకు రక్షణ లేదా..?. విద్యార్థినికి నిజంగానే ఫిట్స్ వచ్చింది. తండ్రి చెప్పినట్లు ఫిట్స్ లేకపోతే అసలు ఏం జరిగింది. ఆమె ఒంటిపై గాయాలు ఎలా వచ్చాయి. ఈ ఘటన జరగడానికి కారణాలేంటి. విద్యార్థినిపై ఏదైనా అఘాయిత్యం జరిగిందా..?.’’ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విద్యార్థినిని జీజీహెచ్ ఆస్పత్రిని తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆమె స్పృహలోకి వస్తే కానీ పూర్తి వివరాలు బయటకు రావని తెలిపారు. అయితే హాస్టల్‌లో జరిగిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Next Story