- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీకి చెందిన ఆర్మీ ఉద్యోగి మిస్సింగ్.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
by Vemula.Srinu Prasad |
ఏపీకి చెందిన ఆర్మీ ఉద్యోగి మిస్సింగ్ అయ్యారు. ..

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)కి చెందిన ఆర్మీ ఉద్యోగి(Army Employee) మిస్సింగ్ అయ్యారు. ఉత్తరాఖండ్ బేస్ క్యాంపు(Uttarakand Base Camp)లో పని చేసే కడప జిల్లా కలసపాడు మండలం ముదిరెడ్డిపల్లె(MudireddyPalle)కు చెందిన నాగార్జున రెడ్డి సెలవులపై స్వగ్రామానికి వెళ్లారు. అయితే సెలవులు ముగియడంతో తిరిగి గత నెల 1న తాను పని చేసే ఉత్తరాఖండ్‌కు బయల్దేరివెళ్లారు. కానీ తమ బేస్ క్యాంపునకు నాగార్జున రెడ్డి రాలేదని ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులకు నాగార్జునరెడ్డి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగార్జున రెడ్డి ఆచూకీ తెలయకపోవడం, ఫోన్ అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
Next Story






