- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరవాడ టోరెంట్ ఫార్మాలో ప్రమాదం.. ఇద్దరికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
అనకాపల్లి జిల్లా పరవాడ టోరెంట్ ఫార్మాలో ప్రమాదం జరిగింది....

దిశ, వెబ్ డెస్క్:అనకాపల్లి జిల్లా పరవాడ టోరెంట్ ఫార్మా(Paravada Torrent Pharma)లో ప్రమాదం జరిగింది. కెమికల్ పౌడర్(Chemical Powder) మీదపడి ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కార్మికులకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. రెండు రోజుల పాటు క్షతగాత్రులను తమ పర్యవేక్షణలో ఉంచాలని వైద్యులు సూచించారు. మరోవైపు క్షతగాత్రుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వాళ్లకు ఏమైందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా పరవాడ ఫార్మా సిటీలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరికొందరు గాయాలపాలవుతున్నారు. అయినా కార్మికుల సెఫ్టీ విషయంలో ఫార్మా సిటీలో ఎలాంటి మార్పులు రావడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నా.. పోయిన ప్రాణాల సంగతి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, పరవాడ ఫార్మా యజమానులు.. కార్మికుల భద్రతపై ఆలోచన చేయాలని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు. ఫార్మాలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎప్పటికప్పుడు అలర్ట్‌గా, అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.






