అమిత్ షా డెడ్ లైన్.. హిడ్మా ఎన్కౌంటర్

by Muthe.Rajitha |

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో నేడు భారీ ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే.

అమిత్ షా డెడ్ లైన్.. హిడ్మా ఎన్కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్ : అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో నేడు భారీ ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు, గెరిల్లా దాడుల స్పెషలిస్ట్ మద్వి మృతిచెందాడు. అయితే హిడ్మా ఎన్కౌంటర్ వెనకాల కేంద్ర హోమ్ శాఖ అమిత్ షా ఆదేశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించాలని అమిత్ షా పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల భద్రతా బలగాల సమీక్షా సమావేశంలో నవంబర్ 30లోగా హిడ్మాను అంతం చేయాలని బలగాలకు ఆదేశాలు ఇచ్చారు.

కానీ ఆ డెడ్‌లైన్ కంటే ముందే హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మృతిచెందడం గమనార్హం. ఇకనైనా మావోయిస్టులు హింసను, ఆయుధాలను వదిలేసి లొంగిపోవాలని లేదంటే ఆపరేషన్ కగర్ కొనసాగించాల్సి వస్తుందని హెచ్చరించారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ అనంతరం.. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై కూంబింగ్ కొనసాగుతోంది.

Next Story