పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు : అంబటి రాంబాబు

by velandi.Saikiran |   (  Updated:2025-05-03 11:47:06  IST  )

పవన్ కళ్యాణ్ (Pawan Kalayn ) చిన్న పిల్లోడు లాంటి వాడు అందుకే మోడీ ( PM Modi) ఆయనకు చాక్లెట్ ( Chocolate) ఇచ్చాడని సెటైర

పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు : అంబటి రాంబాబు
X

దిశ, వెబ్ డెస్క్: పవన్ కళ్యాణ్ (Pawan Kalayn ) చిన్న పిల్లోడు లాంటి వాడు అందుకే మోడీ ( PM Modi) ఆయనకు చాక్లెట్ ( Chocolate) ఇచ్చాడని సెటైర్లు పేల్చారు మాజీ మంత్రి అంబటి రాంబాబు ( Ambati rambabu). ఆంధ్ర ప్రదేశ్ లో ( Andhra Pradesh) నిన్న జరిగిన కూటమి మీటింగ్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ముస్లింలే దేశభక్తులు అంటాడు, ముస్లింలే ఉగ్రవాదులు అంటాడని ఎద్దేవా చేశారు. ఆయనకు స్థిరత్వం ఉండదు, ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని చురకలు అంటించారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు అని నేను చాలా సార్లు చెప్పానని గుర్తు చేశారు. కానీ మా వాళ్లు అందరు ఎగబడి ఓట్లు వేశారని సెటైర్లు పేల్చారు. వాళ్లందరికి ఇప్పుడు అర్థమవుతుందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇది ఇలా ఉండగా అమరావతి ప్రారంభ కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు చంద్రబాబు నాయుడు పాలనపై ప్రశంసలు కురిపించారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రసంగం అనంతరం... అతని పిలిచి మరి ప్రధాని నరేంద్ర మోడీ చాక్లెట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన సంఘటన వైరల్ గా మారింది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ చాక్లెట్ ఇవ్వడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ( Ambati rambabu) కౌంటర్ ఇచ్చారు.

Next Story