- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘హరిహర వీరమల్లు’ పెద్ద హిట్ అవ్వాలి: వైసీపీ ముఖ్య నేత పాజిటివ్ కామెంట్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు చిత్రం(Harihara Veeramallu Movie)పై వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) ఆసక్తికర వ్యా్ఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు చిత్రం(Harihara Veeramallu Movie)పై వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) ఆసక్తికర వ్యా్ఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా సూపర్ డూపర్ హిట్టై, కనకవర్షం కురవాలని కోరుకుంటున్నాను’ అని Xలో రాసుకొచ్చారు. దీనికి పవన్, నాగబాబును ట్యాగ్ చేశారు. అయితే ఇది కూడా సెటైరేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పవన్‌పై తరచూ విమర్శలు గుప్పించే మాజీ మంత్రి అంబటి రాంబాబు సడన్‌గా పాజిటివ్‌గా కామెంట్స్ చేసేసరికి అంతా ఆశ్చర్యపోతున్నారు.
కాగా, ఈ సినిమాలో పవన్ ఒక యోధుడిగా, చారిత్రక పాత్రలో కనిపించనున్నాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్రలో కనిపించనున్నాడు. ‘హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరిట ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జులై 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.






