రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై చంద్రబాబు-రేవంత్ కుట్ర: అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

by Ramesh Naini |

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ పథకాన్ని అడ్డుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిసి కుట్ర పన్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై చంద్రబాబు-రేవంత్ కుట్ర: అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ పథకాన్ని అడ్డుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిసి కుట్ర పన్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గుంటూరులో తాజాగా మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు, చంద్రబాబు, రేవంత్ రెడ్డిని ‘తోడు దొంగలు’గా అభివర్ణిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రముఖ పత్రికలు దాచిపెట్టే ప్రయత్నం చేశాయని విమర్శించారు.

రేవంత్‌ని కాంగ్రెస్‌లోకి పంపింది చంద్రబాబే..

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శ్రీకారం చుడితే, చంద్రబాబు దాన్ని అడ్డుకోవడం దుర్మార్గమని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎలా ఇరుక్కున్నారో ప్రజలందరికీ తెలుసని గుర్తు చేశారు. సీబీఎన్ హయాంలోనే కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచారని, దాంతో కృష్ణా జలాల విషయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాలు అప్పుడే బయటపడ్డాయని విమర్శించారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి పంపింది చంద్రబాబేనని, ఇద్దరూ ఎప్పటికప్పుడు సంప్రదింపుల్లో ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తీరు వల్ల రాయలసీమకు మాత్రమే కాకుండా, మొత్తం రాష్ట్రానికి కృష్ణా జలాల విషయంలో నష్టం జరుగుతోందన్నారు. రేవంత్ రెడ్డి అడిగితే తిరుమలను కూడా చంద్రబాబు ఇచ్చేస్తారేమో అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

Next Story