- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రపంచంలోనే అతిపెద్ద సైకో బాలకృష్ణ : అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
ప్రపంచంలోనే అతిపెద్ద సైకో నందమూరి బాలకృష్ణ అని.. మాజీమంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అతిపెద్ద సైకో నందమూరి బాలకృష్ణ అని.. మాజీమంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలంటే అందుకు సర్టిఫికెట్ కూడా ప్రొడ్యూస్ చేస్తానంటూ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ సంచలనం రేపింది. అంబటి రాంబాబు చేసిన పోస్ట్ పై తెలుగు తమ్ముళ్లు దుమ్మెత్తి పోస్తున్నారు. "బాలకృష్ణ పెద్ద సైకో అంటే చిన్న సైకో మీ రెడ్డిగారేనని ఒప్పేసుకున్నారా ?", " సైకో అంటే చెల్లిని, తల్లిని కూడా తన్ని తగలేసేవాడని, వాళ్లని సైకో కాకపోతే ఇంకేమంటారు?", "దయచేసి ఆ సర్టిఫికెట్ ఏంటో అప్ లోడ్ చేయండి", "ఆంధ్రా ప్రజలకు ఎవరు సైకోనో తెలుసు" ఇలా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ ఒక సైకో అని ఏపీ అసెంబ్లీ వేదికగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. సినిమా టికెట్ల రేట్ల వివాదంలో నాటి సీఎంగా ఉన్న జగన్ ను సినిమావాళ్లు కలిసినపుడు చిరంజీవి గట్టిగా మాట్లాడారని వస్తున్న వార్తలు అవాస్తవమని, చిరంజీవి వల్లే జగన్ దిగివచ్చారని చెప్తున్నదంతా అబద్ధమని చెప్పుకొచ్చారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు రియాక్ట్ కావడంతో.. ఆయనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.






