ఈ జన్మలో అమరావతి పూర్తి కాదు: అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

నంద్యాల వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ...

ఈ జన్మలో అమరావతి పూర్తి కాదు: అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Cm Chandrababu), మంత్రి లోకేష్‌(Minister Lokesh)పై మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణం పూర్తి కావడం అసాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకోవడానికే చంద్రబాబు అమరావతి ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని, రాజధాని నిర్మాణం పేరుతో కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరుస్తున్నారని ఆయన ఆరోపించారు. సుమారు రూ. 2 లక్షల కోట్ల అంచనాలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రూ. 75 వేల కోట్లు ఖర్చు చేశారని, అయినా అక్కడ ఆశించిన ప్రగతి లేదని అంబటి విమర్శించారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం సరికాదని హితవు పలికారు. కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా, వాస్తవ పరిస్థితులను గమనించాలని కోరుతూ కూటమి ప్రభుత్వంపై అంబటి రాంబాబు మండిపడ్డారు.

Next Story