డిప్యూటీ CM సినిమా అయితే టికెట్ రేట్ రూ.1000 చేస్తారా?

by Gantepaka Srikanth |

ఓజీ సినిమా(OG Movie)కు టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) స్పందించారు.

డిప్యూటీ CM సినిమా అయితే టికెట్ రేట్ రూ.1000 చేస్తారా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఓజీ సినిమా(OG Movie)కు టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కనీసం కేబినెట్‌ సమావేశాలకు కూడా పవన్ కల్యాణ్(Pawan Kalyan) హాజరు కావడం లేదన్నారు. మర్మమేంటో చెప్పాలని పవన్ కల్యాణ్‌ను డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం అయితే మాత్రం ఓజీ సినిమా టికెట్ ధర రూ.1000కి పెంచుకుంటారా? అని ప్రశ్నించారు. ఇష్టానుసారంగా టికెట్ల ధరలు పెంచడం కరెక్ట్ కాదన్నారు. జనాల్ని పీక్కుతింటామంటే ఊరుకునేదు లేదని వార్నింగ్ ఇచ్చారు. సుజిత్‌ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా సెప్టెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. డీవీవీ దానయ్య నిర్మాత. ప్రియాంక మోహన్‌ హీరోయిన్. ఇమ్రాన్‌ హష్మి విలన్‌గా కనిపిస్తారు. శ్రియారెడ్డి, అర్జున్‌ దాస్‌, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించారు.

Next Story