- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో లడ్డూ సమస్య తప్ప ఇంకేమీ లేవా? : అంబటి రాంబాబు
ఏపీలో లడ్డూ సమస్య తప్ప ఇంకేమీ లేవా అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. జగన్ పై, వైసీపీ నేతలపై బురద చల్లడమే చంద్రబాబు లక్ష్యమా అని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో లడ్డూ సమస్య తప్ప ఇంకేమీ లేవా అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. జగన్ పై, వైసీపీ నేతలపై బురద చల్లడమే చంద్రబాబు లక్ష్యమా అని అన్నారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ చెప్పినా కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు. పోలీసులను రాజకీయ కక్షల కోసం వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారని అన్నారు. తన ఇల్లు, ఆఫీస్ పై దాడి చేశారని, 5 గంటల నుండి 12 గంటలు దాడి జరుగుతూనే ఉందన్నారు. పోలీసులే ప్రేక్షక పాత్ర పోషించారని ఆరోపించారు. జిల్లా ఎస్పీ కనీసం పట్టించుకోలేదని, రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు, వైవిధ్యాలు ఉంటాయని చెప్పారు. పోలీసులను ఏవిధంగా ఉపయోగిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలు ఆలోచించమని కోరుతున్నానని అన్నారు.






