స్టెప్పులేస్తూ అంబటి రాంబాబూ సంక్రాంతి సంబరాలు

by Thanuru Gopichand |   (  Updated:2026-01-14 04:49:15  IST  )

అంబరాన్ని అంటుతున్న సంక్రాంతి సంబరాలు.

స్టెప్పులేస్తూ అంబటి రాంబాబూ సంక్రాంతి సంబరాలు
X

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన అంబటి రాంబాబు (Ambati Rambabu) మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఇప్పటికే తన స్టెప్పులతో అందరినీ అలరించి అబ్బురపరిచే ఆయన.. సంక్రాంతికి మరో కొత్త పాటతో సరికొత్త స్టెప్పులతో ప్రజల ముందుకొచ్చారు. అయితే పాటలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నప్పటికీ.. అంబటి రాంబాబు వేసే స్టెప్పులు మాత్రం పార్టీలకు అతీతంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

సంక్రాంతిని (Sankranti) పురస్కరించుకొని అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భోగి వేడుకలను (Bhogi Celebrations) నిర్వహించారు. అందులో భాగంగా అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రూపొందించిన ప్రత్యేకమైన పాటను (Special Song) విడుదల చేశారు. వేడుకలకు విచ్చేసిన వారి నడుమ ఆ పాటకు అనుగుణంగా స్టెప్పులేస్తూ ఆకట్టుకున్నారు. రాంబాబు అంటే పాలిటిక్స్ మాత్రమే కాదు ఫన్ విత్ ట్విస్ట్ అని నిరూపించారు. సంక్రాంతి అంటే సంబరాలు.. సంబరాలంటే రాంబాబు గుర్తు రావాల్సిందేనని తన మార్క్ రాజకీయం ప్రదర్శించారు. ఓ వైపు ఎంటర్ టైన్మెంట్ ఇస్తూనే మరోవైపు స్టెప్పులేస్తూ ఆకట్టుకున్నారు. అయితే దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

READ MORE ....

ఫ్రీ ఫ్రీ అనే ఫ్రీ మాటలు నమ్మవద్దు : మాజీ మంత్రి రోజా

Next Story