7 క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన మాజీ మంత్రి అంబటి

by Ajay Maddhiboyina |

సీఎం చంద్ర‌బాబును దూషించిన కేసులో మాజీ మంత్రి అంబ‌టి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అంబ‌టి రిమాండ్ లో ఉన్నారు.

7 క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన మాజీ మంత్రి అంబటి
X

దిశ‌, వెబ్ డెస్క్: సీఎం చంద్ర‌బాబును దూషించిన కేసులో మాజీ మంత్రి అంబ‌టి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అంబ‌టి రిమాండ్ లో ఉన్నారు. కాగా ఆయ‌న హైకోర్టులో 7 క్వాష్ పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. ప‌ట్టాభిపురం, న‌గ‌రంపాలెం, న‌ల్ల‌పాడు, మంగ‌ళ‌గిరి పీఎస్ ల‌లో త‌న‌పై న‌మోదైన కేసులు కొట్టివేయాల‌ని పిటిష‌న్లు వేశారు. మ‌రోవైపు మంగళగిరిలో నమోదైన కేసులో 35(3) BNSS ప్రొసీజర్ ఫాలో అవ్వాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అంబ‌టిపై పీటీ వారెంట్ కోసం పోలీసులు మంగ‌ళ‌గిరి కోర్టులో పిటిష‌న్ వేశారు. మరో ఐదు కేసుల్లో క్వాష్ పిటిషన్లు వచ్చే సోమవారం విచారణ జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అంబటి రాంబాబు అరెస్ట్ తో ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. అంబటిది అక్రమ అరెస్ట్ అని వైసీపీ నాయకులు, కార్యకర్తలు చెబుతుంటూ సీఎంపై నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని కూటమి నేతలు చెబుతున్నారు. అంబటి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయగా జగన్ వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు.

Next Story