- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అద్భుత సన్నివేశం.. శివలింగాన్ని చుట్టుకున్న నాగుపాము
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో సోమవారం ఓ అద్భుత సంఘటన చోటు చేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో సోమవారం ఓ అద్భుత సంఘటన చోటు చేసుకుంది. చెర్లోపల్లి రైల్వే గేటు సమీపంలో ఉన్న విశ్వనాథుని ఆలయంలో శివలింగాన్ని చుట్టుకుని నాగుపాము దర్శనమివ్వడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ వెనుక భాగంలో ఉన్న పుట్టలో నుంచి బయటకు వచ్చిన ఒక నాగుపాము నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించి శివలింగాన్ని చుట్టుకుని పడగ విప్పి నిలబడింది. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ‘హర హర మహాదేవ’, ‘శంభో శంకర’ అంటూ నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.
శివలింగంపై పడగ విప్పి...
నాగుపాము శివలింగంపై పడగ విప్పి నిలబడిన ఘటనను భక్తులు శుభసూచకంగా భావించారు. విషయం తెలుసుకోని భక్తులు ఆలయానికి తరలివచ్చి నాగుపాముకు నమస్కరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వింత దృశ్యాన్ని చూసిన భక్తులు ఇది స్వామివారి మహిమేనని ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు.






