దేవతల రాజధాని నమూనాలో అమరావతి ఉండాలి: సీఎం చంద్రబాబు

by Malleboina Mahesh |

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అయిన అమరావతిలో టీటీడీ ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు.

దేవతల రాజధాని నమూనాలో అమరావతి ఉండాలి: సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అయిన అమరావతి (Amaravati)లో టీటీడీ ఆలయ విస్తరణ (TTD temple expansion)కు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, రాష్ట్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 2019లో ఆలయాన్ని నిర్మించినప్పుడే రాజధానికి అమరావతి అని పేరు పెట్టాలని ఆ వెంకటేశ్వరుడే తనకు సంకల్పాన్ని ఇచ్చాడని చెప్పుకొచ్చారు. అలాగే ఆలయ విస్తరణకు సహకరించి భూమిని ఇచ్చిన రాజధాని రైతులకు ఈ సందర్భంగా సీఎం ధన్యవాదాలు తెలిపారు. తాము ఆలయ విస్తరణకు 25 ఎకరాల భూమిని ఇచ్చామని, దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో.. ఆ నమునాలోనే మన రాష్ట్ర రాజధాని అమరావతి ఉండాలని తాను కోరుకుంటున్నానని అధికారులకు సీఎం సూచించారు. అలాగే తనకు ఆ వెంకటేశ్వర స్వామే ప్రాణభిక్ష పెట్టారని, వెంకటేశ్వరుడి సన్నిధిని ఎప్పటికీ అపవిత్రం చెయ్యనివ్వనని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Next Story