విజయవాడలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ నేషనల్ వర్క్ షాప్ ప్రారంభం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-30 08:03:01  IST  )

విజయవాడలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ నేషనల్ వర్క్ షాప్ షాప్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు...

విజయవాడలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ నేషనల్ వర్క్ షాప్ ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: ఐబీఎం, టీసీఎస్ , ఎల్ అండ్ టీ భాగస్వామ్యంతో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పార్క్‌ను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాలీ పార్క్‌వర్క్ షాప్‌ను విజయవాడలో ఏర్పాటు చేశారు. ఈ వర్క్ షాప్‌లో పలు స్టార్టప్ కంపెనీల ఎగ్జిబిషన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ వర్క్ షాప్‌లో ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్, ఐబీఎం ఇండియా వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్ టీసీఎస్ ప్రెసిడెంట్ గ్లోబల్ హెడ్ వి.రాజన్న మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీ రాజీవ్ కుమార్, ఏటీ అండ్ టీ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ సిద్ధు, తదితరులు హాజరయ్యారు. వీరితో పాటు భారత్ బయోటెక్ వ్యవస్థాపకురాలు సుచిత్రా కె. ఎల్లా, హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌, నేషనల్ క్వాంటం మిషన్ డైరెక్టర్ జె.బి.వి.రెడ్డి, కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ కార్యదర్శి అభయ్ కరాండికర్, కేంద్ర ప్రభుత్వ సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ కుమార్ సూద్, నేషనల్ క్వాంటం మిషన్ డైరెక్టర్ జేబీవీ రెడ్డి, రెడ్డి ల్యాబ్స్ , అస్ట్రాజెన్కా, అమెజాన్ , హెచ్ సీఎల్ , ఎల్ అండ్ టీ, ఐఐటీ మద్రాస్, తిరుపతి, బ్యాంక్ ఆఫ్ అమెరికా తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక ఈ వర్క్ షాప్‌లో ఐబీఎం సంస్థ ప్రదర్శించిన ప్రోటోటైప్ క్వాంటమ్ కంప్యూటర్‌ను సీఎం, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పరిశీలించారు.

Next Story