- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Andhra Pradesh:5 జిల్లాల పరిధిలో అమరావతి ORR.. కేంద్రం గెజిట్!
రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు(ORR) నిర్మాణానికి అడుగులు పడ్డాయి.

దిశ,వెబ్‌డెస్క్: రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు(ORR) నిర్మాణానికి అడుగులు పడ్డాయి. రాజధాని అమరావతిని దేశంలోని అనేక జాతీయ రహదారులతో అనుసంధానం చేసే ఓఆర్‌ఆర్‌కు కేంద్ర ప్రభుత్వం(Central Govt) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఔటర్ రింగ్ రోడ్డుకు ఆమోదం తెలుపుతూ.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో 189.9కిమీ మేర అలైన్‌మెంట్‌కు ఓకే చెప్పింది. 5 జిల్లాల(ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు) పరిధిలోని 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా రోడ్డు నిర్మాణం జరగనుంది. త్వరలోనే భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. ORRలో 2 బ్రిడ్జిలు, 78 అండర్ పాస్‌లు, 65 వంతెనలు నిర్మిస్తారు.
ఈ క్రమంలో విజయవాడ(Vijayawada) తూర్పు బైపాస్ అవసరం లేదని తేల్చి చెప్పింది. దానికి ప్రత్యామ్నాయంగా రెండు లింక్ రోడ్ల నిర్మాణానికి అవకాశం కల్పిస్తూ నిర్ణయించింది. హైదరాబాద్‌లో గచ్చిబౌలి వైపు నుంచి ORRకి అనుసంధానం ఉన్న విధంగానే.. చెన్నై-కోల్‌కత్త జాతీయ రహదారిలో విజయవాడ బైపాస్(Vijayawada Bipas) మొదలయ్యే కాజ నుంచి తెనాలి సమీపంలోని నందివెలుగు వరకు 17కి.మీ మేర ఆరు వరుసల అనుసంధాన రహదారిని నిర్మించుకున్నారు. దీని కోసం మూడు ఎలైన్‌మెంట్లను NHAI సిద్ధం చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. గుంటూరు(Guntur) బైపాస్‌లో బుడంపాడు నుంచి నారాకోడూరు వద్ద ORR వరకు నాలుగు వరుసలుగా రహదారిని విస్తరిస్తారు.






