- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Minister Narayana : అమరావతికి మరో 10 వేల ఎకరాలు కావాలి : మంత్రి నారాయణ
by Muthe.Rajitha |
ఏపీ రాజధాని అమరావతి(AP Capital Amaravati)కి మరిన్ని భూములు కావాలని మంత్రి నారాయణ(Minister Narayana) తెలిపారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ రాజధాని అమరావతి(AP Capital Amaravati)కి మరిన్ని భూములు కావాలని మంత్రి నారాయణ(Minister Narayana) తెలిపారు. రాజధాని నిర్మాణానికి మరో 10 వేల ఎకరాలు కావాలని వెల్లడించారు. అమరావతిలో నిర్మించబోయే విమానాశ్రయానికి 5 వేల ఎకరాలు, కాలుష్య రహిత పరిశ్రమలకు 2500 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ(Sports City) 2500 ఎకరాలు అవసరం అవుతుందని పేర్కొన్నారు. రానున్న ఏడాదిలో రాజధాని నగరంలో 4 వేల ఇళ్లను అధికారుల కోసం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే మరో ఏడాదిన్నర కాలంలో రాజధాని నగరంలో అంతర్జాతీయస్థాయి రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించనట్టు మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఇక అమరావతిలో నిర్మించబోయే ఐకానిక్ భవనాలు మూడేళ్లలో పూర్తి చేయడమే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు.
Next Story






