అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 విధి విధానాలు జారీ

by Naga Rani Yarlagadda |

రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్ స్కీం - 2025 (Amaravati Land Pooling Scheme - 2025) విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.

అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 విధి విధానాలు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్ : రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్ స్కీం - 2025 (Amaravati Land Pooling Scheme - 2025) విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు తెలుపుతూ సమగ్ర నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రాజధాని కోసం భూములు ఇచ్చే రైతులకు వర్తింపజేసే ప్రయోజనాలను ఆ నోటిఫికేషన్ లో వివరించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలో మరో 40 వేల ఎకరాల భూమిని సమీకరించనున్నట్లు గతవారం మంత్రి నారాయణ తెలిపారు. ల్యాండ్ పూలింగ్ స్కీం నిబంధనలు ఉంటాయని, ల్యాండ్ పూలింగ్ నిబంధనలు 2025ను సీఆర్డీఏ (CRDA) నోటిఫై చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.

Next Story