- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమరావతి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ సలహా కమిటీ నియామకం.. ఆదేశాలు జారీ
by Naga Rani Yarlagadda |
అమరావతి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డెవలప్మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 21 మందితో సలహా కమిటీని నియమించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: అమరావతి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డెవలప్మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 21 మందితో సలహా కమిటీని నియమించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీ ఛైర్మన్ గా నీతి ఆయోగ్ మెంబరైన వీకే సారస్వత్ ను నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే కో ఛైర్మన్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, కమిటీ సభ్య కార్యదర్శిగా ఎస్ఆర్ఎం గ్రూప్ డైరెక్టర్ నారాయణరావు నియమితులయ్యారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్, హైడ్రోజన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఆర్కే మల్హోత్రా తదితరులను కమిటీలో సభ్యులుగా నియమించారు. హైడ్రోజన్, దాని ఉత్పత్తుల ప్రమోషన్ కోసం సలహా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.
Next Story






