- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Amaravathi : 1,631 రోజుల సుదీర్ఘ పోరాట ఫలం
రాజధాని అమరావతి భూసమీకరణ, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రాజధాని రైతుల ఉద్యమం.. ఈ రెండు రికార్డు సృష్టించాయి.

* అమరావతి రైతుల ఉద్యమం స్ఫూర్తిదాయకం
• ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుని సమయం ఇది
• తుళ్లూరులో భారీ ర్యాలీ నిర్వహించిన రాజధాని రైతులు
దిశ, డైనమిక్ బ్యూరో : రాజధాని అమరావతి భూసమీకరణ, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రాజధాని రైతుల ఉద్యమం.. ఈ రెండు రికార్డు సృష్టించాయి. ఏపీలో మూడు రాజధానులను ప్రకటిస్తూ 2019 డిసెంబర్ 17వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో ప్రకటించారు. ఆ మరుసటి రోజు నుంచి రాజధాని రైతులు తమ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. అమరావతిని ఏకైక రాజధానిగా (Rajadjani) ఉంచాలంటూ రోడ్లకెక్కారు. అయితే వారి ఉద్యమాన్ని అణచివేయాలని నాటి వైసిపి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. పోలీసులను ప్రయోగించి దమనకాండ సృష్టించిందని రైతులు ఆరోపించారు. అయినా వారు వెనకడుగు వేయలేదు. 1,631 రోజుల పాటు సుదీర్ఘ పోరాటం చేశారు. వారి పోరాటం ఫలించింది. '2024లో కూటమి ప్రభుత్వం రాకతో చీకట్లు పోయి వెలుగులు వచ్చాయి. నమ్మి ఇచ్చిన భూమి వినియోగం అవుతోంది. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుతుంది. ఇప్పటివరకు రాజధాని లేని మనకు ప్రపంచస్థాయి నగరం సిద్ధమవుతోంది ఇక ఆంధ్రులు సగర్వంగా గుండెల మీద చేయి వేసుకొని మా రాజధాని అమరావతి అని చెప్పుకునే రోజు వచ్చింది..’ అని ఇప్పుడు రైతులు చెబుతున్నారు. అమరావతి ని రక్షించేందుకు గత ఐదేళ్లు తాము చేసిన పోరాటం ఫలించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు తుళ్లూరులో (Tulluru))భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు






