సంఖ్యాబలంలో తక్కువైనా ప్రజాబలంలో మాదే పైచేయి: టీడీపీ ఎమ్మెల్యే డోలా

by Seetharam |

సంఖ్యాబలంలో తక్కువైనా.. ప్రజాబలంలో మాదే పైచేయి అని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు.

సంఖ్యాబలంలో తక్కువైనా ప్రజాబలంలో మాదే పైచేయి: టీడీపీ ఎమ్మెల్యే డోలా
X

దిశ, డైనమిక్ బ్యూరో : సంఖ్యాబలంలో తక్కువైనా.. ప్రజాబలంలో మాదే పైచేయి అని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. తెలుగుదేశం సభ్యులు అసెంబ్లీకి రావాలి... వస్తే తాము 70 ఎమ్.ఎమ్ లో సినిమా చూపిస్తాం అంటూ మంత్రి జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అంటే అసెంబ్లీకి టీడీపీ సభ్యులు రాకూడదనే పరోక్షంగా రెచ్చగొడుతున్నారని అన్నారు. సంఖ్యా బలంలో టీడీపీ తక్కువే కావచ్చుగానీ, ప్రజాబలంలో అధికారపార్టీకంటే మాదే పైచేయి అని చెప్పుకొచ్చారు. దళితులు, బీసీలు, మైనారిటీలతో పాటు, మహిళలు, రైతులు, యువత ఎదుర్కొంటు న్న సమస్యలు, ఆయా వర్గాలకు ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి చేసిన అన్యాయాన్ని తాము వాస్తవాలతో సహా ప్రజలకు తెలియచేయాలని నిర్ణయించుకున్నాం అని అన్నారు. అధికారపార్టీ మైక్ ఇవ్వకపోయినా, పోరాడేవిషయంలో తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అని ఎమ్మెల్యే డోలా బాలవీరాంజ నేయ స్వామి స్పష్టం చేశారు.

Next Story