Alluri: గిరిజనులకు తప్పని డోలి కష్టాలు.. రోడ్డు లేక అవస్థలు

by Ramesh Goud |

ప్రభుత్వాలు మారినా గిరిజనులకు డోలి కష్టాలు తప్పడం లేదు.

Alluri: గిరిజనులకు తప్పని డోలి కష్టాలు.. రోడ్డు లేక అవస్థలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వాలు మారినా గిరిజనులకు డోలి కష్టాలు తప్పడం లేదు. రోడ్లు లేక డోలీలు ఏర్పాటు చేసుకొని రోగులను, శవాలను మోసుకొని కిలో మీటర్ల మేర నడిచి వెళుతున్నారు. ఇలాంటి ఘటనే అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Seetharamaraju District) అనంతగిరి మండలం(Ananthagiri Mandal)లో జరిగింది. పెదకోట(Pedhakota) పంచాయతీ మడ్రేబు గ్రామానికి చెందిన సిలకమ్మ అనే మహిళ మరణించింది. ఆమెను గ్రామంలోకి తీసుకెళ్లడానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో మహిళ బంధువులు డోలి ఏర్పాటు చేసుకొని తీసుకెళ్లారు. డోలిలో శవాన్ని పెట్టి అడవిలో ఏడు కిలోమీటర్ల దూరం మోసుకెళ్లారు. దీనిపై గ్రామస్థులు గ్రామానికి రోడ్డు లేక కష్టాలు తప్పడం లేదని వాపోతున్నారు. తమ గ్రామస్తులలో ఎవరికైనా జబ్బు చేసిన ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు రోడ్డు మార్గం లేక భుజాల పైనే మోసుకెళతామని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.

Next Story