- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు ఈ-లాటరీ విధానంలో రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు
రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.

దిశ, వెబ్ డెస్క్ : రాజధాని అమరావతి (Amaravati) రైతుల సంక్షేమానికి (Farmers Welfare) ఏపీ ప్రభుత్వం మరో కీలక ఘట్టం పూర్తి చేయనుంది. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు నేడు ఈ-లాటరీ (E-Lottery) విధానంలో ప్లాట్లను కేటాయించనుంది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) ఆధ్వర్యంలో ప్లాట్ల కేటాయింపు జరగనుంది. మొత్తం 15 గ్రామాలకు చెందిన రైతులకు ఈ-లాటరీ విధానంలో రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించనున్నారు. ఉదయం వేళ 14 గ్రామాలకు చెందిన రైతులకు ప్లాట్లకు కేటాయించనున్నారు. మధ్యాహ్నం నుంచి ఉండవల్లిలో మెట్ట భూములిచ్చిన 201 మంది రైతులకు లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అత్యంత పారదర్శకంగా ప్రక్రియను జరుపుతున్నామని స్పష్టం చేవారు. రాజధాని మాస్టర్ ప్లాన్, సీడ్ యాక్సెస్ రోడ్డు వంటి కీలక ప్రాజెక్టుల కోసం భూములిచ్చి దశాబ్ద కాలంగా ప్లాట్ల కోసం ఎదురు చూస్తు్న్న రైతులకు ప్రభుత్వ నిర్ణయం ఊరటనిస్తోందన్నారు. రైతులు నేరుగా ఈ-లాటరీ ప్రక్రియను వీక్షించేలా ఏర్పాట్లను చేశామని వెల్లడించారు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు మొత్తం 29,233 మంది రైతులకు 69,421 ప్లాట్లను కేటాయించడం జరిగింది. ప్రస్తుత ప్రక్రియలో ప్లాట్లు పొందిన రైతులు ఏవైనా జాప్యం లేకుండా వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకునేలా సీఆర్డీఏ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా జీఐఎస్ (GIS) సిబ్బందిని, గ్రామ సర్వేయర్లను నియమించి రైతులకు వారి ప్లాట్ల భౌగోళిక సరిహద్దులను గుర్తించడంలో సహాయం చేయనున్నారు. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండానే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని, రైతులు తమకు కేటాయించిన ప్లాట్ల ప్రొవిజనల్ సర్టిఫికేట్లను వెంటనే తీసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. అమరావతి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్న క్రమంలో పెండింగ్‌లో ఉన్న భూ సమీకరణ సమస్యలను పరిష్కరిస్తూ రైతులకు న్యాయం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ అడుగు వేసిందని ప్రకటించారు.






