- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ నెల 29న రాజధాని రైతులకు మలివిడత ప్లాట్ల కేటాయింపు
రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు వేసిన కూటమి ప్రభుత్వం.

దిశ, వెబ్ డెస్క్ : అమరావతి (Amaravati) రాజధాని నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. సీడ్ యాక్సిస్ రోడ్డు (Seed Access Road) నిర్మాణానికి తమ భూములను త్యాగం చేసిన రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను ఏపీ రాజధాని (AP Capital) ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) వేగవంతం చేసింది. వాస్తవానికి ఈ నెల 28వ తేదీన ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ జరగాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఒక రోజు ముందుకు కార్యక్రమాన్ని అధికారులు వాయిదా వేశారు. ఈ నెల 29వ తేదీన కేటాయింపును నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మలివిడత ప్లాట్ల కేటాయింపులో భాగంగా సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం భూములిచ్చిన రైతులకు పారదర్శకమైన ఈ-లాటరీ (e-Lottery) విధానం ద్వారా స్థలాలను కేటాయించనున్నారు. నిబంధనల ప్రకారం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు సీఆర్డీఏ యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని అధికారులు పేర్కొన్నారు.
రాజధాని అభివృద్ధిలో భాగంగా సీడ్ యాక్సిస్ రోడ్డు అనుసంధానానికి అత్యంత ప్రాధాన్యత ఉండటంతో, అందుకు భూములిచ్చిన రైతుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాజధానిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఈ లాటరీ ప్రక్రియలో పాల్గొననున్నారు. ఈ ప్లాట్ల కేటాయింపు పూర్తయిన వెంటనే రైతులకు ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేయనున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ప్లాట్ల కేటాయింపులో జాప్యాన్ని నివారించేందుకు, రైతులకు భరోసా కల్పించేందుకు అధికారులు ఈ నెల 29న జరిగే ఈ-లాటరీ కోసం వేదికను సిద్ధం చేశారు. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రైతులకు రావాల్సిన ప్రయోజనాలను సకాలంలో అందించడం ద్వారా అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.






