Ap: అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం.. స్పీకర్ కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-23 17:32:24  IST  )

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది...

Ap: అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం.. స్పీకర్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. శాసన సభ, శాసనమండలి సమావేశాలు సోమవారం నుంచి నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే సభ్యులందరూ హాజరు కావాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇప్పుడే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సభలకు హాజరుకావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ హారుకానున్నారని తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయాలని నిర్ణయించారు.

అయితే ప్రభుత్వం కూడా అస్త్రశస్త్రాలు రెడీ చేస్తోంది. సోమవారం ఉదయం 9.30లకే సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి చేరుకోనున్నారు. ఉదయం10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభ వాయిదా తర్వాత బీఏసీ మీటింగ్ నిర్వహించనున్నారు. ఎన్ని రోజులు ఉభయసభలు నడపాలనే అంశాలపై చర్చించనున్నారు. మూడు వారాల పాటు సభలు నడపాలని యోచిస్తున్నారు. బీఏసీ మీటింగ్‌లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అటు అసెంబ్లీ వద్ద కూడా పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే డీజీపీతో ప్రభుత్వం చర్చించింది.

Next Story