- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి : హోంమంత్రి అనిత
రథ సప్తమి ఏర్పాట్లకు ప్రభుత్వ ముందస్తు చర్యలు.

దిశ, వెబ్ డెస్క్ : రథ సప్తమి వేడుకలు జనవరి 25న జరగనున్నాయి. పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి శ్రీకాకుళంలో పర్యటించారు. పర్యటనలో భాగంగాని పోలీస్ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించారు. మంత్రి అనితకు జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకర్, స్థానిక ఎమ్మెల్యే గోండు శంకర్ లతో మంత్రి సమావేశం నిర్వహించారు.
సమావేశంలో మంత్రి అనిత మాట్లాడుతూ రథ సప్తమిని పురస్కరించుకొని అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. కాబట్టి అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేవాలయం వద్ద పరిసరాల పరిశుభ్రతకు, మౌలిక వసతుల మెరుగుదలకు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అంతేకాకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. గత అనుభవాల దృష్ట్యా క్యూలైన్లను పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేందుకు వీలు కల్పించాలన్నారు. ఎటువంటి అవాంఛిత ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేయాలని అధికారులకు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల భద్రత విషయమై అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. కలిసికట్టుగా పనిచేసి రథ సప్తమి వేడుకలను ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.






