- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
200 కేజీల ఆల్ఫ్రాజోలం పట్టివేత.. ఇద్దరి అరెస్ట్
by Vemula.Srinu Prasad |
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ఐడీఏలో ఆల్ఫ్రాజోలం కలకలం రేపింది. ఓ కంపెనీలో 200 కేజీల ఆల్ఫ్రాజోలం ఉన్నట్లు నార్కోటిక్ ఇంటెలిజెన్స్ శాఖ అధికారులకు సమాచారం అందింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా(Ntra District) కొండపల్లి ఐడీఏ(Kondapalli IDA)లో ఆల్ఫ్రాజోలం(Alfrazolam) కలకలం రేపింది. ఓ కంపెనీలో 200 కేజీల ఆల్ఫ్రాజోలం ఉన్నట్లు నార్కోటిక్ ఇంటెలిజెన్స్ శాఖ(Narcotic Intelligence Department) అధికారులకు సమాచారం అందింది. దీంతో కంపెనీలో తనిఖీలు నిర్వహించి సీజ్ చేశారు. ఆల్ర్పాజోలంతో పాటు అదనంగా 800 కిలోల ముడి పదార్థాలు, 2,860 లీటర్ల రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. లభ్యమైన ఆల్ప్రాజోలం విలువ రూ. 47 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. అలాగే కంపెనీలో రియాక్టర్, డ్రైయర్, సెంట్రిఫ్యూజ్ వంటి ఇండస్ట్రియల్ మెషిన్లను గుర్తించారు. డ్రగ్ తయారు చేసేందుకు కెమికల్ ఫ్యాక్టరీని అద్దెకు తీసుకుని నడుపుతున్నట్లు విచారణలో తేలింది.
Next Story






