TTD News:తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్

by Jakkula.Mamatha |   (  Updated:2026-01-19 01:53:38  IST  )

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

TTD News:తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు(సోమవారం) శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఈ తరుణంలో శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. తిరుమల భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(ఆదివారం) శ్రీవారిని 84,058 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,512 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.4.21 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే.. తిరుమల శ్రీవారి ఏప్రిల్ కోటా ఆర్జిత సేవా టికెట్లను(సుప్రభాతం, తోమాల, అర్చన) టీటీడీ నేడు విడుదల చేయనుంది. భక్తులు ఈ నెల(జనవరి) 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఈ-డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందినవారు 23వ తేదీ మధ్యాహ్నం 12 లోపు నగదు చెల్లించాలి. 22న కల్యాణోత్సవం, 23న అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్ట్, 24న రూ.౩౦౦ ప్రత్యేకదర్శనం, గదుల కోటాను విడుదల చేయనున్నారు.

Next Story