రాష్ట్ర ప్రజలకు అలర్ట్.. ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు

by Jakkula.Mamatha |   (  Updated:2025-04-12 02:10:40  IST  )

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.

రాష్ట్ర ప్రజలకు అలర్ట్.. ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు తీవ్ర ప్రభావం చూపుతున్నాడు. ఈ క్రమంలో ప్రజలు బయటకు వెళ్దామంటే భయపడిపోతున్నారు. ఈ తీవ్రమైన ఎండల ప్రభావంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఇక తీవ్రమైన ఎండలతో పాటు వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో నేడు(శనివారం) పలు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా వెల్లడించింది.

రాష్ట్రంలో వాతావరణం(weather)లో భిన్నమైన మార్పులు కనిపించడం.. అక్కడక్కడా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే పలు చోట్ల వర్షాలు పడుతున్న వడగాలుల తీవ్రత మాత్రం పరాకాష్టకు చేరింది. మధ్యాహ్నం వేళల్లో బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ(శనివారం) వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ రోజు 66 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. ఈ తరుణంలో అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ(Department of Meteorology) సూచించింది.

Next Story