తిరుమ‌ల వెళ్లే భ‌క్తుల‌కు అల‌ర్ట్..ఘాట్ రోడ్డులో జాగ్ర‌త్త !

by velandi.Saikiran |

బీటి రోడ్డు మనమత్తు పనులు వేగంగా సాగుతున్న నేపథ్యంలో వాహనాలను కాస్త అప్రమత్తంగా నడపాలని విజ్ఞప్తి చేసింది టీటీడీ.

తిరుమ‌ల వెళ్లే భ‌క్తుల‌కు అల‌ర్ట్..ఘాట్ రోడ్డులో జాగ్ర‌త్త !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో బీటీ రోడ్డు మరమ్మతు పనులు చాలా వేగంగా సాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పనులు తిరుమల నుంచి తిరుపతి వెళ్లే ఘాట్ రోడ్డులో జరుగుతున్నాయి. ఈ తరుణంలో వాహనదారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది టీటీడీ పాలక మండలి. బీటి రోడ్డు మనమత్తు పనులు వేగంగా సాగుతున్న నేపథ్యంలో వాహనాలను కాస్త అప్రమత్తంగా నడపాలని విజ్ఞప్తి చేసింది టీటీడీ.

వాహ‌న‌దారుల‌కు కీల‌క సూచ‌న‌లు

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులు జరుగుతున్నప్పటికీ ఘాట్ రోడ్డును మూసి వేయలేదని తెలిపింది టీటీడీ. అయితే ఈ రోడ్డు గుండా వెళ్లే వాళ్లు నిర్దేశించిన టైమింగ్స్ లో మాత్రమే వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. దర్శనం అనంతరం తిరుమల నుంచి వెళ్లిపోయే భక్తులు ముందస్తుగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని సూచనలు చేసింది. కనీసం గంట ముందుగానే తమ ప్రయాణం సాగించాలని పేర్కొంది. అప్పుడే గమ్యస్థానాలకు త్వరగా చేరుకుంటారని స్పష్టం చేసింది. మర‌మ్మ‌తు పనులు జరుగుతున్న నేపథ్యంలో వాహనాలు కాస్త మెల్లగా వెళ్లడం వల్ల, ట్రాఫిక్ ఏర్పడుతుంది. తద్వారా తిరుపతికి చేరే సమయం కాస్త పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఒక గంట ముందుగా ప్రయాణం ప్రారంభించాలని వెల్లడించింది టీటీడీ.

Next Story