- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాణిపాకం ఆలయం వెళ్లే భక్తులకు అలర్ట్.. ఆలయ ఈవో కీలక ప్రకటన
ఏపీ(Andhra Pradesh)లోని చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనానికి నిత్యం వందలాది మంది భక్తులు తరలి వస్తుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనానికి నిత్యం వందలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కాణిపాకం(Kanipakam) వినాయకుడి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా కాణిపాకం దేవస్థానం కూడా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ వస్తుంది. ఇక ప్రస్తుతం వేసవి కాలం కావడంతో భక్తులు(Devotees) అధికంగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ తరుణంలో కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్(EO Penchala Kishore) కీలక ప్రకటన చేశారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనానికి వచ్చే ప్రొటోకాల్, వీఐపీ ద్వారా దర్శనం చేసుకునే వారు(ఉభయదారులు), వారి కుటుంబ సభ్యులు మినహా.. సిఫార్సులపై వచ్చే ప్రతి ఒక్కరూ విధిగా టికెట్లు తీసుకోవాలని ఆలయ ఈవో వెల్లడించారు. అయితే.. సిఫార్సులపై కాణిపాకం ఆలయం వచ్చే భక్తులు స్వామివారి దర్శనానికి ఉచితంగా వెళ్తున్నారని ఆయన తెలిపారు. ఇకపై ఆలయ ఉద్యోగులు కూడా వారికి కావాల్సిన వారు వచ్చిన విధిగా టికెట్లు కొనుగోలు చేసి దర్శనానికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ విధానం ఈ రోజు(శనివారం) నుంచే అమలు అవుతుందన్నారు.






