పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. హాల్‌టికెట్లు విడుదల

by Jakkula.Mamatha |

రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది.

పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. హాల్‌టికెట్లు విడుదల
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. ఏపీ(Andhra Pradesh) టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ హాల్ టికెట్లను ఇవాళ(మే 12) బోర్డు విడుదల చేసింది. ఈ క్రమంలో పదో తరగతి విద్యార్థులు(10th Class Students) తమ జిల్లా, స్కూల్ పేరు, తమ పేరు, పుట్టిన తేదీ ఎంటర్ చేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు ‘మనమిత్ర’ యాప్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ లో 9552300009 నంబర్‌కు HI అని మెసెజ్ చేసి హాల్ టికెట్లు పొందవచ్చు. హాల్‌టికెట్ల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ ని సందర్శించండి.

ఇదిలా ఉండగా.. ఈ నెల(మే) 19 నుంచి 28 వరకు ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో(AP SSC Results 2025) 81.14 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ సంవత్సరం 6,14,459 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. వారిలో 4,98,585 మంది ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) వెల్లడించారు.

Next Story