- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. హాల్‌టికెట్స్ వచ్చేశాయ్!
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల(10th Class Exams)కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇటీవల విద్యాశాఖ(Education Department) విడుదల చేసిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల(10th Class Exams)కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇటీవల విద్యాశాఖ(Education Department) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం 31 వరకు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో మార్చి 17న ఫస్ట్ లాంగ్వేజ్, 19న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 21న ఇంగ్లీష్, 24న గణితం, 26న ఫిజిక్స్, 28న బయాలజీ, 29న వోకేషనల్, మార్చి 31న సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఫిజికల్ సైన్స్, బయలాజీకల్ సైన్స్ పేపర్లకు మాత్రం ఒక్కోరోజు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లను ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) చెప్పినట్లుగానే వాట్సప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో వివిధ పరీక్షల హాల్‌టికెట్ల(Hall Tickets)ను విద్యార్థులు తమ ఫొన్ల(Moblie)లోని వాట్సప్(Watsapp) ద్వారా పొందవచ్చు. ఇంటర్ విద్యార్థులు ఇటీవలే హాల్‌టికెట్లను ఈ విధానంలోనే పొందగా.. తాజాగా పదో తరగతి విద్యార్థులు కూడా వారి హాల్‌టికెట్లను వాట్సప్‌లో డౌన్‌లోడ్(Download) చేసుకుంటున్నారు. రాష్ట్రంలో మొదటి సారిగా ఈ విధానం అమల్లోకి రావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సాధారణంగా హాల్‌టికెట్లు పాఠశాలల్లో ఇచ్చేవారు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 95523 00009 వాట్సప్ గవర్నెర్స్ నంబరుతో ఎవరికి వారు నేరుగా హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతోంది.






